అంతర్జాతీయ స్థాయి కాగితపు పరిశ్రమగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సీఐఐపేపర్‌టెక్: భారతీయ పల్ప్ &పేపర్ రంగాన్ని
ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దడంపైదృష్టి సారించిన వార్షిక సదస్సు
హైదరాబాద్: భారతీయ పల్ప్, పేపర్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అంకితమైన ప్రీమియర్ కాన్ఫరెన్స్ అయిన సీఐఐ పేపర్‌టెక్ 18వ ఎడిషన్ సెప్టెంబర్ 10 & 11 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతోంది. ఈ సంవత్సరం సదస్సు, "మేక్ ఇండియన్ పల్ప్ &పేపర్ ఇండస్ట్రీ వరల్డ్ క్లాస్" అనే థీమ్‌తో జరుగుతోంది. ఈ నేపథ్యంలోఈ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచే వ్యూహాలను చర్చించడానికి పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలు,ఈ రంగంతో సంబంధం గలవారందరినీ ఈ సదస్సు ఒకచోట చేర్చింది.
ఈ సదస్సు సందర్భంగా పేపర్‌టెక్ 2024 ఛైర్మన్, శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్-ఆపరేషన్స్ శ్రీ గణేష్ భడ్టీ స్వాగతోపన్యాసం చేశారు. థీమ్ గురించి వివరించారు. ‘‘మనం శిలాజఆధారిత ఉత్పత్తుల నుండి తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లుతున్నందున పరిమాణం, ప్రాముఖ్యతలో కాగితం పరిశ్రమ అపూర్వ మార్పును చూస్తోంది" అని శ్రీభడ్టీ అన్నారు. "భారతీయ కాగితం, బోర్డు పరిశ్రమ గత దశాబ్దంలో ఉద్గారాలను 20% పైగా విజయవంతంగా తగ్గించింది, ఇది హరిత ఉత్పత్తి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ప్రెసిడెంట్, నైనీ పేపర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ అగర్వాల్ మాట్లాడుతూ, "ప్లాంటేషన్ ఆధారిత పేపర్ పరిశ్రమఅపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది,4-5 సంవత్సరాలలోనే మొక్కలు బాగా పెరిగేలా చేస్తోంది’’ అని అన్నారు. ‘‘ఇటువంటి సుస్థిర విధానంతో, పేపర్ పరిశ్రమ భవిష్యత్తు గతంలో కంటే ప్రకాశవంతంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.
ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీపీటీఏ)వైస్ ప్రెసిడెంట్, ఖన్నా పేపర్ మిల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎస్వీఆర్కృష్ణన్ పేపర్ ఉత్పత్తి సాంకేతికతలలో తాజా ధోరణులు, కార్యాచరణ సామర్థ్యంపై వాటి ప్రభావం గురించి చర్చించారు. "ఇండస్ట్రీ 4.0 తయారీ తీరుతెన్నులను మారుస్తోంది కాబట్టి, ప్రక్రియను సజావుగా ఆటోమేట్ చేసే సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి, తద్వారా మనం మరింత చురుకైన విధంగా ఉండేలా, ప్రతిస్పందించేలా చేస్తోంది" అని అన్నారు.
ఇండియన్ న్యూస్‌ప్రింట్ తయారీదారుల సంఘం (ఐఎన్ఎంఏ) ప్రెసిడెంట్, ఖన్నా పేపర్ మిల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ, న్యూస్‌ప్రింట్ ఉత్పత్తిలో సవాళ్లు, పురోగతులు ప్రస్తావించారు. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన వ్యూహాత్మక విధానాల గురించి చర్చించారు. "వర్ధమాన నిపుణుల నుండి తాజా ఆలోచనలను గ్రహించడం చాలా ముఖ్యం, ఎందుకంటే వారు రేపటి నాయకులుగా మారతారు" అని శ్రీ ఖన్నా అన్నారు.
మేథో చర్చలు, ముఖ్య ప్రసంగాలతో పాటు, పేపర్‌టెక్ 2024 "పేపర్ సెక్టార్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ మాన్యువల్-వాల్యూమ్ 12"ని విడుదల చేసింది.ఇది పరిశ్రమలోని పురోగతిని, ఆవిష్కరణలను వివరిస్తుంది. పల్ప్, పేపర్ రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టర్ ఎఆర్‌కె రావును విశిష్ట వ్యక్తిత్వ పురస్కారంతో సదస్సు సత్కరించింది.
పేపర్‌టెక్ 2024 అనేది 23వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌తో కలిసి నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం తర్వాత ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఉత్కృష్టతకు గాను 25వ సీఐఐనేషనల్ ఎనర్జీ అవార్డ్స్ అందజేస్తారు.భారతదేశంలోని ప్రముఖ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు శక్తి సామర్థ్యం, శక్తి నిర్వహణలో తమ సాంకేతిక &నిర్వాహక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.
About CII:
CII works to create and sustain an environment conducive to the growth of industry in India, partnering industry and government alike through advisory and consultative processes. CII-GBC facilitates the Pulp & Paper sector by promoting sustainable practices, energy efficiency, and technological innovations to enhance operational efficiency through energy audits, GHG Inventorization studies, the recently launched “CIINet-Zero Program,” and other initiatives.