వరద బాధితులకు సహాయార్థం ప్రఖ్యాత లలితా జ్యువెలరీస్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన కిరణ్ కుమార్ గారు ఈ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎంగారు వారందరినీ అభినందించారు.