Press release *హైద‌రాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజ‌న్ థెర‌పీ ఛాంబ‌ర్‌* * వ‌య‌సును అధిగ‌మించేంద

Press release   *హైద‌రాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజ‌న్ థెర‌పీ ఛాంబ‌ర్‌*  * వ‌య‌సును అధిగ‌మించేంద Press release *హైద‌రాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజ‌న్ థెర‌పీ ఛాంబ‌ర్‌* * వ‌య‌సును అధిగ‌మించేంద

Press release 

*హైద‌రాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజ‌న్ థెర‌పీ ఛాంబ‌ర్‌*

* వ‌య‌సును అధిగ‌మించేందుకు రాస్ మెడికల్ ఫిట్ నెస్ సెంటర్ స‌రికొత్త విప్ల‌వం
*న‌గ‌ర‌వాసుల కోసం అందుబాటులో హెచ్‌బీఓటీ ఛాంబ‌ర్ ఏర్పాటు
*ఇప్ప‌టికే 20 మందికి విజ‌య‌వంతంగా చికిత్స‌లు

*హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 20, 2025:* హైద‌రాబాద్ న‌గ‌రంలోని వైద్య చికిత్స‌ల‌లో ఇదో స‌రికొత్త విప్ల‌వం. న‌గ‌రంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైప‌ర్‌బేరిక్ ఆక్సిజ‌న్ థెర‌పీ (హెచ్‌బీఓటీ) సాయంతో 20 మందికి రాస్ మెడిక‌ల్ ఫిట్‌నెస్ సెంట‌ర్ విజ‌య‌వంతంగా చికిత్స అందించింది. 

హెచ్‌బీఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెర‌పీ. ఇందులో ఆరోగ్యం కావాల‌నుకునేవారు ప్రెష‌రైజ్డ్ ఛాంబ‌ర్‌లో 100% స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ పీల్చుకుంటారు. దీనివ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను మ‌రింత మెరుగ్గా స్వీక‌రిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటల‌ను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్‌నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా దాని ప్ర‌యోజ‌నాలు అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చాయి. 

రుజువైన ప్ర‌యోజ‌నాలు- యాంటీ ఏజింగ్‌, రిక‌వ‌రీ విష‌యంలో స‌మూల మార్పులు
రాస్ మెడిక‌ల్ ఫిట్‌నెస్ సెంట‌ర్‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి రోగులు వేగంగా కోలుకోవ‌డానికి, ఆరోగ్యం మెరుగుప‌డ‌డానికి సేవ‌లు అందిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు విభాగాల్లో అసాధార‌ణ ఫ‌లితాలు సాధించింది. వాటిలో ప్ర‌ధాన‌మైన‌ది యాంటీ ఏజింగ్‌, చ‌ర్మ పున‌రుజ్జీవ‌నం. 

వ‌య‌సుతో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు స‌రైన ప‌రిష్కారం
హెచ్‌బీఓటీ చికిత్స వ‌ల్ల చ‌ర్మం మీద అసాధార‌ణ ప్ర‌భావాలు క‌నిపిస్తాయ‌ని ఇప్ప‌టికే శాస్త్రీయంగా రుజువైంది. బ‌య‌టి వాతావ‌ర‌ణంలో మ‌నం గాలి పీల్చుకునేట‌ప్పుడు అందులో 20 శాతం మాత్ర‌మే ఆక్సిజ‌న్ ఉంటుంది. దాన్ని మ‌నం పీల్చుకుని, మ‌ళ్లీ 15% బ‌య‌ట‌కు వ‌దిలేస్తాం. అంటే, 5 శాతం ఆక్సిజ‌న్ మాత్ర‌మే మ‌న శ‌రీరంలోకి వెళ్తుంది. కానీ, అదే హెచ్‌బీఓటీ ఛాంబ‌ర్‌లో అయితే మొత్తం నూరుశాతం ఆక్సిజ‌న్ మాత్ర‌మే ఉంటుంది. దాన్ని మ‌న శ‌రీరం పూర్తిగా పీల్చుకోవ‌డం వ‌ల్ల కొల్లాజెన్ ఉత్ప‌త్తి ప్రేరేపితం అవుతుంది. చ‌ర్మం స్థితిస్థాప‌క‌త మెరుగుప‌డుతుంది. దానివ‌ల్ల శ‌రీరం మీద ఉండే గీత‌లు త‌గ్గిపోతాయి. మ‌న క‌ణ‌జాలం కూడా చాలా ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. ఎముక‌లు, కండ‌రాల‌కు వ‌య‌సుతో పాటే వాటిల్లే న‌ష్టాన్ని కూడా ఇది త‌గ్గిస్తుంది. దీనివ‌ల్ల గుండె కండ‌రాలు, ఊపిరితిత్తుల ప‌నితీరు చాలా మెరుగుప‌డుతుంది. గ‌తంలో మ‌ధుమేహ బాధితులకు ఏవైనా గాయాలు అయిన‌ప్పుడు, లేదా శ‌స్త్రచికిత్స‌లు చేసిన‌ప్పుడు వారి చ‌ర్మం త్వ‌ర‌గా కోలుకునేందుకు వీలుగా ఇలాంటి చికిత్స‌లు సూచించేవారు. కానీ, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్య‌వంతుల‌కు కూడా ఈ చికిత్స వ‌ల్ల చ‌ర్మంతో పాటు శరీరంలోని క‌ణాల‌న్నింటికీ కూడా ఎన‌లేని ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. అవ‌న్నీ ఆరోగ్య‌వంతం కావ‌డంతో వ‌య‌సు ప్ర‌భావం వ‌ల్ల క‌నిపించే చ‌ర్మం ముడ‌త‌లు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గిపోతాయి. 

ఇది కాక ఇంకా... 
* దీర్ఘకాలిక అలసట, శక్తి బూస్ట్: ఈ చికిత్స ఆక్సిజన్ డెలివరీని పెంచి, అలసటను తగ్గిస్తుంది, సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది
* డయాబెటిస్, జీవక్రియప‌ర‌మైన‌ ఆరోగ్యం: ర‌క్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది. గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది, రక్తంలో చక్కెరశాతాన్ని స‌రిగ్గా నిర్వ‌హించేలా చూస్తుంది.
* క్యాన్సర్ చికిత్స‌లు: రేడియేషన్ తర్వాత కణజాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. క్యాన్స‌ర్ బాధితుల‌కు రోగనిరోధకశ‌క్తి మెరుగుప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. 
* నాడీ స‌మ‌స్య‌లు: స్ట్రోక్, మెదడుకు అయ్యే గాయాలు, రోగులలో న్యూరోడీజెనరేటివ్ స‌మ‌స్య‌ల‌కు, జ్ఞాప‌క‌శ‌క్తి పునరుద్ధరణకు సహాయపడుతుంది
* ఒత్తిడి, జీవనశైలి పునరుద్ధరణ: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది

ఆధునిక వైద్యం, చికిత్స‌ల‌లో గేమ్ ఛేంజ‌ర్‌
అస‌లు తొలినాళ్ల‌లో దీన్ని క‌నుక్కున్న‌ప్పుడు.. డ్రైవ‌ర్ల‌లో డీకంప్రెష‌న్ సిక్‌నెస్‌కు చికిత్స చేయ‌డానికి ఉప‌యోగించేవారు. కానీ త‌ర్వాత ఇప్పుడు దానివ‌ల్ల‌ అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతున్నాయి. యాంటీ ఏజింగ్, జీవిత‌కాలాన్ని పెంచ‌డం, క్యాన్స‌ర్ చికిత్స‌ల వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు, ముఖ్యంగా రేడియేష‌న్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాల నుంచి కోలుకునేలా చేయ‌డం, జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డం, ఒత్తిడి, నిద్ర‌లేమి లాంటి జీవ‌న‌శైలి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, అథ్లెట్ల సామ‌ర్థ్యాన్ని పెంచి, కండ‌రాలు కోలుకునేలా చేయ‌డం లాంటి అనేక ప్ర‌యోజ‌నాలు దీంతో సిద్ధిస్తున్నాయి. 

రాస్ మెడిక‌ల్ ఫిట్‌నెస్ సెంట‌ర్ గురించి: రాస్ మెడిక‌ల్ ఫిట్‌నెస్ సెంట‌ర్ అనేది హైదరాబాద్ న‌గ‌రంలోని ఒక ప్రధాన వెల్‌నెస్‌, హెల్త్‌కేర్ సంస్థ‌. వ్యాధుల నుంచి కోలుకుఓవ‌డం, స‌మ‌గ్ర ఆరోగ్యం, ప‌నితీరు విష‌యాల‌కు సంబంధించి శాస్త్రీయ చికిత్స‌ల‌ను అత్యాధునిక విధానాల్లో అందించేందుకు ఇది అంకిత‌మైంది. సంపూర్ణ వైద్యం, వినూత్న చికిత్సలపై దృష్టి సారించిన రాస్ సంస్థ‌.. హెచ్‌బీఓటీ, ఇతర పునరుత్పత్తి చికిత్సలతో చికిత్స‌ల భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది.