బీసీల హక్కుల కోసం కవిత పోరాటం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశంస

బీసీల హక్కుల కోసం కవిత పోరాటం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశంస బీసీల హక్కుల కోసం కవిత పోరాటం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశంస

బీసీల హక్కుల కోసం కవిత పోరాటం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశంస

బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎమ్మెల్సీ కవితతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీసీల పక్షాన కవిత ముందుకు వచ్చి పోరాడుతున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ సమాజం కూడా కవితకు నైతికంగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

 

**"బీసీలకు 42% రిజర్వేషన్ అవసరం – కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు"**

 

ప్రస్తుతం బీసీలకు న్యాయం జరుగటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణయ్య, 75 ఏళ్లుగా బీసీలను అన్యాయం జరుగుతోందన్నారు. వాస్తవ పరిస్థితిని గుర్తించి, కమిట్మెంట్‌తో ఉద్యమించకపోతే ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

**"బీసీ కాకపోయినా, కవిత మన కోసం పోరాడుతున్నారు"**

 

కవిత బీసీ కాకపోయినా, బీసీల హక్కుల కోసం ధైర్యంగా ముందుకు వచ్చారని కొనియాడారు. "మన కోసం పులి మీద స్వారీకి సిద్ధమయ్యారు. ఆమె చేసే పోరాటాన్ని ఎవరూ తప్పుగా చూడకూడదు," అని స్పష్టం చేశారు.

 

**జూలై 17 రైల్ రోకోకు మద్దతు**

 

బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం జరుగుతున్న ఉద్యమానికి అంతా ఐక్యంగా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. జూలై 17న జరగనున్న జాగృతి రైల్ రోకోకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ కవితకు హామీ ఇచ్చారు