పీప్ సైట్ రైఫిల్ షూటింగ్ అండర్ 19 విభాగంలో సాయి హన్సికకు గోల్డ్ మెడల్..
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన పీప్ సైట్ రైఫిల్ షూటింగ్ అండర్ 19 విభాగంలో వసుందర జూనియర్ బాలికల కళాశాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన చక్రత్ సాయి హన్సిక గోల్డ్ మెడల్ ను సాధించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గత రెండు రోజులుగా స్థానిక ఎస్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రైఫిల్ షూటింగ్ అండర్ 14, 17, 19 విభాగాలలో జరిగిన పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఐదు పతకాలు లభించాయి.
పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.ఈ రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసిన సంవత్సరంలోపే ఈ పతకాలు సాధించడం పట్ల కోచ్ మహమ్మద్ అబ్దుల్ నబీ, క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. జనవరి 5, 2026 న మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరగబోయే జాతీయ స్థాయిలో పోటీలలో కూడా మంచిగా ప్రతిభ కనపరిచి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రం కు పేరు ప్రక్యతలు తీసుకొని రావాలని క్రీడాకారులను కోరారు. పతకాలు గెలుపొందిన వారి వివరాలు: శ్రీరామ్ అండర్ 19 పిస్తోల్ లో సిల్వర్ మెడల్, పీప్ సైట్ రైఫిల్ షూటింగ్ అండర్ 19 విభాగంలో చక్రత్ సాయి హన్సిక గోల్డ్ మెడల్, బి సహస్ర అండర్ 19 పీప్ సైట్ రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్, ఏ పూజిత అండర్ 17 ఓపెన్ సైట్ రైపిల్ లో సిల్వర్ మెడల్, పి రోజా గ్రేస్ అండర్ 19 ఓపెన్ సైట్ రైఫిల్ లో సిల్వర్ మెడల్,పి నాగ వెంకట మేధా అండర్ 19 ఓపెన్ సైడ్ రైపిల్ విభాగంలో సిల్వర్ మెడలను సాధించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి, జిల్లా విధ్య
శాఖ అధికారిని బి.నాగలక్ష్మి , ఎస్టిఎఫ్ సెక్రటరీ వి. నరేష్, కోచ్ అబ్దుల్ నబీ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.